
పేదలకు కళ్ళజోళ్ళు వితరణగా అందించిన సర్పంచ్ కాపా శ్రీనివాసరావు
నూజివీడు మండలం రావిచర్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇటీవల ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో పేదలకు గ్రామ సర్పంచ్ కాపా శ్రీనివాసరావు మంగళవారం కళ్ళజోళ్ళు వితరణగా అందించారు. ఈ సందర్భంగా కాపా మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ గా ప్రజల యోగక్షేమాలు తన బాధ్యతగా స్వీకరించినట్లు స్పష్టం చేశారు. జ్ఞానేంద్రియం నయనం ప్రధానం అన్న పెద్దల సూక్తి అనుసరించి గ్రామ ప్రజల నేత్ర దృష్టి బాగుండాలని లక్ష్యంగా ముందడుగులు వేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే ఇటీవల గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అవసరమైన వారికి అక్కడే కంటి మందులను, డ్రాప్స్ అందించినట్లు తెలిపారు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి కళ్ళజోళ్లను ఉచితంగా అందజేసినట్లు చెప్పారు. భవిష్యత్తులో పేదలకు ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలు చేయి ఇస్తామన్నారు. ఇందుకోసం నైపుణ్యం గల నేత్ర శస్త్ర చికిత్స విభాగం వైద్యులు సిద్ధంగా ఉన్నారని వివరించారు. వైద్యులు అందించే సలహాలు సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. పరీక్షల తరువాత ఇచ్చిన మందులు, డ్రాప్స్ క్రమ పద్ధతిలో వినియోగించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కంటి చూపును నిరంతరం సంరక్షించుకోవాలన్నారు. తిరి వీధి కృష్ణ సేవలు అభినందనీయమన్నారు.