ताज़ा ख़बरें

ఉచిత కళ్ళజోళ్ళ పంపిణీ

ఉచిత కళ్ళజోళ్ళ పంపిణీ

ఉచిత కళ్ళజోళ్ళ పంపిణీ

 

ఆగిరిపల్లి పట్టణంలో తిరి వీధి లక్ష్మీ రామారావు సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం పేదలకు ఉచితంగా కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నూజివీడు డివిజనల్ ఉప విద్యాశాఖ అధికారి ఎం సేవ్యా నాయక్ మాట్లాడుతూ తిరి వీధి లక్ష్మీ రామారావు సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నూజివీడు నియోజకవర్గ పరిసరాలలో ఉచిత నేత్ర మరియు జనరల్ మెడికల్ క్యాంపులు నిర్వహించడం అభినందనీయమన్నారు. సేవా ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ తిరువీధి కృష్ణ ఆధ్వర్యంలో నిరుపేదలు నివసించే ప్రాంతాలను ఎంపిక చేసుకుని మెడికల్ క్యాంపులను నిర్వహించి ఉచిత పరీక్షలు, ఉచితంగా మందులు పంపిణీ చేయడం ఎంతో ఆదర్శనీయమన్నారు. ట్రస్ట్ తరఫున ఎన్ఎస్ ఆసుపత్రిలో సబ్సిడీపై నేత్ర శస్త్ర చికిత్సలు నిర్వహించటం జరుగుతుందన్నారు. ఇలాంటి అరుదైన అవకాశాన్ని నిరుపేదలు సద్వినియోగం చేసుకొని, నేత్ర సంబంధమైన మరియు జనరల్ అనారోగ్యాలకు సంబంధించి పూర్తిస్థాయి వైద్య సేవలు పొంది ఆరోగ్యవంతులుగా ముందడుగు వేయాలని సూచించారు. సేవా ట్రస్ట్ మరిన్ని మెడికల్ క్యాంపులు నిర్వహించి, నిరుపేదల ఆరోగ్య అభివృద్ధి పట్ల మరిన్ని ప్రణాళికలతో దినదిన అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సేవా ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ తిరివీధి కృష్ణ, ట్రస్ట్ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

Show More
Back to top button
error: Content is protected !!