
మీర్జాపురం గ్రామంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం
ఏలూరు జిల్లా పరిథిలో గల నూజివీడు నియోజకవర్గ పరిధిలోని
నూజివీడు మండలంలోని మీర్జాపురం గ్రామం లో గల పంచాయతీ కార్యాలయంలో బుధవారం తిరివీధి లక్ష్మీ రామారావు సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ ప్రజలకు ఉచిత పరీక్షలు నిర్వహించి, గ్రామ సర్పంచ్ గోళ్ళ పద్మ వెంకటేశ్వరరావు చేతులమీదుగా ఉచిత మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోళ్ళ పద్మ వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ తిరివీధి కృష్ణ తన తల్లిదండ్రుల పేరిట సేవా ట్రస్ట్ ఏర్పాటుచేసి, నిజమైన పేదలకు వైద్య సేవలు క్షేత్రస్థాయిలో అందజేయడం అభినందనీయమన్నారు. పేదలకు ఉచిత న్యాయ సేవ అందించడమే కాక, సామాజిక సేవలో భాగంగా పేద కుటుంబాలకు వైద్య సేవలను చేరువ చేయడం ప్రశంసనీయమన్నారు. నేటి యువత తిరివీధి కృష్ణ బాటలో పయనించాలని సూచించారు. సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు తిరివీధి కృష్ణ, టిడిపి గ్రామ పార్టీ అధ్యక్షులు గోళ్ళ భాస్కర్ రావు గారు మరియు ప్రతినిధులు పాల్గొన్నారు.