
ఏలూరు జిల్లా ముదినేపల్లి:: *”ఇదే మాకు త్రాగునీరు”త్రాగటానికి మంచినీళ్లు ఇప్పించండి మహాప్రభో పెయ్యేరు పంచాయతి గ్రామ,శివారుగ్రామ నివాసులు ఆత్మఘోష* : మంచి నీటి బదులుగా కలుషిత నీరు నీ విడుదల చేస్తు పెయ్యేరు పంచాయతీ చెరువు నుండి ప్రజలకి త్రాగటానికి వాటర్ ట్యాక్ ద్వారా ఫిల్టర్ చేసి స్వచ్చమైన మంచినీటి ని ప్రజలకు అందించవలసిన పంచాయతీ అధికార ఉద్యోగ సిబ్బంది నేరుగా చెరువులో వున్న నీటిని విడుదల చేస్తూ ప్రజల ప్రాణాలతొ చెలగాటం ఆడుతూన్న పలు,పలు,సార్లు పంచాయతీ అధికారులకి తెలియచేసినా మారని తీరుపై పెయ్యేరు, రంగాపురం, ఆటోనగర్, వై.ఎస్.అర్ కాలని వాసులు గా నివసిస్తున్న షుమారు 1500ల కుటుంబాలకు అందించవలసిన త్రాగు నీరు సమస్య పై ప్రస్తుత ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం లో ముదినేపల్లి వచ్చిన సందర్భములో వినతి పత్రాన్ని అందిచామని, అధికారంలోకి వచ్చాక శాశ్వత పరిష్కారం చేయిస్తామని హామీని ఇచ్చారని, ప్రస్తుత కైకలూరు నియోజక వర్గం ఏం.ఎల్.ఏ.కామినేని శ్రీనివాస్ కూడా ఎన్నికలలో సురక్షిత మంచినీటిని అందిస్తామని హామీఇచ్చారని,ఈరోజు వరకు పంచాయతీ అధికారులు,నాయకులు, మా పెయ్యేరు పంచాయతీలో నివసిస్తున్న పేయ్యేరు, రంగాపురం, ఆటోనగర్, వైయస్సార్ కాలనీ, ప్రజలమైన మాకు త్రాగటానికి మంచినీటిని అందించకపోవటం పై ఆవేదనను వ్యక్తపరుస్తున్నామన్నారు కేంద్ర ప్రభుత్వం ద్వారా జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి పరిశుభ్రమైన మంచినీటిని అందిస్తామని కాలయాపనతో త్రాగుటానికి మంచి నీరుని సరఫరాచేయకుండా కలుషితమైన దుర్వాసనతో కూడిన మలినమైన పరిశుభ్రత లేని త్రాగు నీటిని పంచాయతీ పైపుల ద్వారా అందిస్తూన్నదున మా జీవితాలకు హాని కలుగుతోందని బాధతో ఆవేదనని వ్యక్తపరిస్తూ ఇప్పటికైనా మాపై దయచూపించి మంచి త్రాగునీటిని అందిచాలని కోరుతున్న ప్రజలు