
ఏలూరు జిల్లా కైకలూరు *ఆలయ కార్య నిర్వహణాధికారి కూచిపూడి శ్రీనివాస్ చేతుల మీదగా ఘనంగా ప్రారంభమైన పెద్దింట్లమ్మ జాతర మహోత్సవం* ఈరోజు నుండి ఈనెల 13వ తారీకు వరకుజరపబడుతున్నటువంటి కొల్లేటికోట పెద్దింట్లమ్మ వారి జాతర మహోత్సవ కార్యక్రమాన్ని ఆలయ వేద పండితుల మంత్రాలతో ఆలయ కార్య నిర్వహణ అధికారి కూచిపూడి శ్రీనివాస్ చేతుల మీదగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి శాస్త్రొక్తముగా పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తొలి రోజు వేలాదిగా భక్తులు పాల్గొని అమ్మవారికి నైవేద్యాలు మొక్కుబళ్లను చెల్లించారు నేటి నుండి 13 వ తారీకు వరకు జరుపబడుతున్న ఈ అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమాలలో భక్తులు వేలాదిగా పాల్గొని అమ్మవారికి మొక్కుబళ్ళు చెల్లిస్తారని కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొనే భక్తులకు మొక్కుబళ్ళు చెల్లించే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పోలీస్ అధికారులు,హెల్త్ డిపార్ట్మెంట్,వివిధ శాఖల అధికారులు,స్వచ్ఛందంగా అమ్మవారి ఆలయం వద్ద వాలంటీర్స్ , అందరితో కలిసి భక్తులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని,,ఉదయం ఐదు గంటల నుంచి వేద మంత్రాలతో,మంగళ వాయిద్యాలతో మహాగణపతి పూజ శ్రీ చక్రఅర్చన జల దుర్గా సమేత పెద్దింట్లమ్మ తల్లి అమ్మవారి పూజా కార్యక్రమాలతో భుజబలపట్నం గ్రామ వాస్తవ్యులు ముదునూరి రామలింగరాజు దంపతులు అమ్మవారి విశేష పూజాకార్యక్రమములో పాల్గొని పూలదండలు,పూజా సామాగ్రీ,ఉచిత ప్రసాద కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారని, ఏలూరు వాస్తవ్యురాలు సబ్బా భారతి కళాకారునిచే పార్వతీ కళ్యాణం హరికథా కాలక్షేపం జరగపడుతుందని ఆలయ కార్య నిర్వహణ అధికారి కూచిపూడి శ్రీనివాస్ తెలియ చేసారు