
రామకృష్ణ సేవా సమితి ఆశ్రమంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం
ఏలూరు జిల్లా పరిథిలో గల నూజివీడు పట్టణంలోని రామకృష్ణ సేవా సమితి ఆశ్రమంలో సోమవారం తిరి వీధి లక్ష్మీ రామారావు సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు పండ్రంకి వెంకట సత్యనారాయణ మూర్తి, బ్రహ్మచారి భాస్కరన్ జి, లయన్ పి కృష్ణ ప్రసాద్ లు మాట్లాడుతూ వృద్ధులైన పెద్దలకు ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నేత్ర వైద్య శిబిరంలో అందరికీ ఉచితంగా పరీక్షలు నిర్వహించి, మందులు ఉచితంగా అందించినట్లు తెలిపారు. సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు, తిరివీధి కృష్ణ అవకాశం ఉన్నంతవరకు ప్రతి నెల కూరగాయలు, న్యూట్రిషన్ ఫుడ్ వితరణగా అందిస్తున్నట్లు చెప్పారు. తన మిత్రులతో కూడా రామకృష్ణ సేవా సమితికి వితరణ చేసేలా ప్రోత్సహించడం అభినందనీయమన్నారు.