
ఏలూరు జిల్లాముదినేపల్లి ::: *ప్రభుత్వ ఆదేశానుసారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పించిన గ్రామ సర్పంచ్ గంటా రాకేష్ కుమార్* స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖలు ప్రతిష్టాత్మకము తీసుకొని ప్రజా ఆరోగ్యం ప్రగతికి వెలుగు బాటని ప్లాస్టిక్ వస్తువులు వాడకాన్ని నిర్మూలించాలని కార్యక్రమాన్ని ప్రారంభించామని గ్రామ సర్పంచ్ గంటా రాకేష్ అందరినీ ఉద్దేశిస్తూ, ఈకార్యక్రమంలో భాగంగా ఈరోజు పెదపాలపర్రు గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ గంటా రాకేష్ కుమార్,ఉపసర్పంచ్ గన్నమనేని వెంకటేశ్వరరావు ప్రజలను ఉద్దేశిస్తూ ప్రతి ఇంట్లోనూ తడి చెత్త పొడి చెత్త విడివిడిగా విలేజి గ్రీన్ అంబాసిడర్లకు అందించాలని ఇంటి చుట్టుపక్కల ఆవరణలని సుబ్రపరచుకొని, పరిశుభ్రతను పాటించాలని గ్రామములో చుట్టుపక్కల పరిశుభ్రత పాటించాలని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటే అభివృద్ధి సాధించడానికి మార్గం సుఖమైన జీవితాన్ని ప్రతి ఒక్కరూ పొందటానికి , పరిశుభ్రత ముఖ్యమని గ్రామంలోని వీధుల వెంబడి చెత్తలను వేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛంద స్వచ్ఛ్ దివాస్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విధిగా పాటించి ఆరోగ్యంగా ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, గ్రామస్తులు పంచాయితీ కార్యదర్శి ఎం గోవర్ధన్ రావు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం రాజ్యలక్ష్మి,ఏం.ఎల్.హెచ్.పీ.శరణ్య, గ్రామ రెవెన్యూ అధికారి, వారి సిబ్బంది పాల్గొన్నారన్నారు వారందరితో కూడా గ్రామ సర్పంచ్ గంటా రాకేష్ ప్రతిజ్ఞ చేయించానని, ప్లాస్టిక్ రహిత సంచులని ప్రజలకు పంచుతున్నామని, కాలుష్య నిర్మూలనకై ప్రతి ఒక్కరూ విధిగా చెట్లు పెంచాలని అందరికీ అవగాహన కల్పించామని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేశారు