
*చిగురుకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు కిట్లు ప్రదానం చేసి 100%ఉత్తీర్ణత సాధించాలన్న టూరిజం శాఖ డైరెక్టర్ కొడాలి వినోద్* ఏలూరు జిల్లా ముదినేపల్లి: సోమవారం అనగా 17/03/2025 వ తేది నుంచి 10వ తరగతి విద్యార్థులకు బోర్డు ఎగ్జామ్స్ జరుగుతున్న సందర్భంగా చిగురుకోట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఎగ్జామ్ కిట్లు పంపిణీ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ డైరక్టర్ కొడాలి వినోద్ పాల్గొని 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ కిట్లు అందజేసి విద్యార్థులకు పరీక్షలు బాగా రాసి 100% ఉత్తీర్ణత సాధించాలని కోరారు.అనంతరం స్కూల్లోని విద్యార్థులతో కలిసి మధ్యాన భోజనం చేసి బెస్ట్ విషెష్ తెలియచేశామన్నారుఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ పెరం స్వామి,చలసాని జగన్మోహనరావు,చొప్పరపు ఫణి,తెలుగుదేశంపార్టీ గ్రామ ప్రెసిడెంట్ తుమ్మా వీరాంజనేయులు ,ముచ్చు నాగేశ్వరరావు,దాసి ఆంజనేయులు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.