
కోడిపందాలు నిర్వహిస్తున్న ఏడుగురిపై కేసు నమోదు.
ఏలూరు జిల్లా టి, నర్సాపురం శివారు కృష్ణాపురం గ్రామంలో ఆదివారం కోడిపందాలు నిర్వహిస్తున్న ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోడిపందాలు నిర్వహిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి వారి వద్ద నుంచి 13 వేల రూపాయలు నగదు తో పాటు ఒక కోడిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ దాడిలో టి నర్సాపురం ఎస్ ఐ జయబాబుతో పాటు సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు.