
*శరవేగంగా వడాలి-సింగరాయపాలెం-కోరుకొల్లు రహదారి మరమ్మతులు* ముదినేపల్లి-సింగరాయపాలెం-కోరుకొల్లు ప్రధాన రహదారికి ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు కావడంతో త్వరితగతిన మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. సుమారు 25 కిలోమీటర్లు ఆర్ అండ్ బి రహదారి శిధిలం కావడంతో రహదారి మరమ్మతులకు 4 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు, రహదారి పూర్తిగా దెబ్బతిన్న కొన్ని చోట్ల ముందు మారామత్తు పనులు చేపట్టారు. వడాలి సెంటర్ నుండి ఈ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులు శెరవేగవంతంగా రోడ్ మరామత్తులు చేసేందుకు నిర్ణిత సమయానికి పూర్తి చేయనున్నట్లు ఎ.ఇ. అరవింద్ వివరించారు.