ताज़ा ख़बरें

తిరువీధి కృష్ణ సేవలు అభినందనీయం

తిరువీధి కృష్ణ సేవలు అభినందనీయం

తిరివీధి కృష్ణ సేవలు అభినందనీయం

 

 

* రామకృష్ణ సేవా సమితి లో కూరగాయల వితరణ

 

 

* తిరివీధి లక్ష్మీ రామారావు సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కూరగాయలు, న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్స్ వితరణ

 

నూజివీడు

 

 

ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న నూజివీడు పట్టణంలోని శ్రీ రామకృష్ణ సేవా సమితి లో ఏ ఆధారము లేని వయోవృద్ధులైన పెద్దలకు నిర్వహిస్తున్న నిత్యాన్నదానానికి తిరివీధి లక్ష్మీ రామారావు సేవా ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ తిరివీధి కృష్ణ పోషకాహారం,కూరగాయలను మంగళవారం నాడు వితరణగా అందించారు. ఈ సందర్భంగా ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ నీలా వన వేంకటేశ్వర్లు (వేంకట్) మాట్లాడుతూ ప్రతి నెల కనీసం నాలుగు పర్యాయాలు కూరగాయలు, పౌష్టికాహారం వితరణగా అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. సేవా సమితి ఆశ్రమంలో నిత్యం ఎవ్వరూ ఆధారం లేని వయోవృద్ధులైన పెద్దలు 40 మందికి నిత్యఅన్నదానం, సాయంత్రం వేళల్లో నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారులు 40 మందికి ఉచితంగా ప్రైవేట్ చెబుతూ, పౌష్టికాహారం అందించటం జరుగుతుందన్నారు. సమాజంలో దాతృత్వం చూపే కొందరి వితరణతో ఈ సేవా సమితిని కొనసాగిస్తున్నట్లు వివరించారు. స్పందించే వారు ఎవరైనా రామకృష్ణ సేవాసమితిలో సంప్రదించి పెద్దల నిత్యాన్నదానానికి, చిన్నారులకు అందించే పౌష్టికాహారానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరివీధి లక్ష్మీ రామారావు సేవా ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ తిరివీధి కృష్ణ, రామకృష్ణ సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు పండ్రంగి సత్యనారాయణమూర్తి, బ్రహ్మచారి భాస్కరన్ స్వామీజీ, ప్రతినిధి రాంబాబు, పెద్దలు పాల్గొన్నారు.

Show More
Back to top button
error: Content is protected !!