
ఆగిరిపల్లి ఈ నేల 11 వతేదిన సియం చంద్రబాబు నాయుడు గారు పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రి -కొలుసు పార్థసారథి
ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ఆగిరిపల్లి కి ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు ఈ నెల 11వ తేదీన పర్యటన దృష్ట్యా ఏర్పాట్లను మంగళవారం ఆగిరిపల్లిలో అధికారులతో కలిసి రాష్ట్ర గృహనిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి గారు పరిశీలించారు. అగిరిపల్లి శివారు హెలిప్యాడు, మరియు బహిరంగ సభకు సంబందించిన స్థల సేకరణ కోసం అధికారులు ప్రతిపాదించిన ప్రదేశాలను మంత్రి పరిశీలించారు. హెలిప్యాడ్ కు ప్రతిపాదించిన స్థలంలో హెలికాప్టర్ లాండింగ్ అయ్యేందుకు అనువైన ప్రదేశాన్ని గుర్తించాలని, పరిసర ప్రదేశాలలో పటిష్టమైన భద్రతా ఉండేలా స్థలాన్ని గుర్తించాలన్నారు. హెలీప్యాడ్ నుండి బహిరంగ సభకు తక్కువ దూరం ఉండేలా చూడాలన్నారు. బహిరంగ సభకు హాజరయ్యే ప్రజల సంఖ్య ననుసరించి అంత సామర్ధ్యం కలిగిన ప్రదేశాన్ని గుర్తించాలన్నారు. వేసవి దృష్ట్యా బహిరంగ ప్రదేశంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని, హాజరయ్యే ప్రజల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని టెంట్లు, కుర్చీలు ఏర్పాటు చేయాలన్నారు. హెలీప్యాడ్ , బహిరంగ సభ నిర్వహించనున్న ప్రదేశాలు భద్రతా పరంగా అనువైన ప్రదేశాలను గుర్తించాలన్నారు.