
*వర్గీకరణ సారధికి క్షీరాభిషేకం*
ఈరోజు నూజివీడు పట్టణంలోని స్థానిక శ్రీనివాస మహల్ సెంటర్లో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వారి విగ్రహం వద్ద
*SC వర్గీకరణ సారధి, అభినవ అంబేద్కర్, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారికి పాలాభిషేక కార్యక్రమాన్ని నూజివీడు మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు కలపాల విలియమ్స్ మాదిగ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది*
ఈ యొక్క కార్యక్రమానికి *ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లూరి నాగేంద్రబాబు మాదిగ* పాల్గొనడం జరిగింది. ఆయన మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ గారి అలుపెరగని మూడు దశాబ్దాల పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ అని అన్నారు.
*నూజివీడు నియోజకవర్గం ఎంఆర్పిఎస్ అధ్యక్షులు దుబ్బాకు దేవరాజుమాదిగ* మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును శాసనసభలోను, శాసనమండలిలోనూ ఏకగ్రీవంగా ఆమోదం పొందటం . ఈ యొక్క బిల్లు ఆమోదం నకు కృషి చేసిన మన *పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ అన్నకు కృతజ్ఞతలు తెలియజేసారు* *
కార్యక్రమంలో ముళ్ళపూడి వెంకటేశ్వరరావు మాదిగ ఎం ఎస్ పి జిల్లా ఉపాధ్యక్షులు, కొమ్ము వెంకటేశ్వరరావు గారు నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్, ఉదయగిరి కృపారావు మాదిగ, ముల్లంగి జమలయ్య మాదిగ, కలపాల కృపారావు, కల్లేపల్లి ఆదినారాయణ, దొండపాటి దేవ సాల్మన్, వెంపటి సైమన్, కలపాల రామారావు న్యాయవాది, దుబ్బాకు మరియదాసు మాదిగ, కలపాల రాజు, కలపాల ఆది సర్వేశ్వరరావు, రవి గౌడ్ మరియు మాదిగ పెద్దలు నియోజకవర్గంలోని, నూజివీడు పట్టణంలోని MRPS, MSP అనుబంధ సంఘాల నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మందకృష్ణ మాదిగ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది