రావిచర్ల గ్రామంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం
నూజివీడు మండలం రావిచర్ల గ్రామం లోని పంచాయతీ కార్యాలయంలో శనివారం తిరివీధి లక్ష్మీ రామారావు సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ ప్రజలకు ఉచిత పరీక్షలు నిర్వహించి, గ్రామ సర్పంచ్ కాపా శ్రీనివాసరావు చేతులమీదుగా ఉచిత మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాపా శ్రీనివాసరావు మాట్లాడుతూ తిరివీధి కృష్ణ తన తల్లిదండ్రుల పేరిట సేవా ట్రస్ట్ ఏర్పాటుచేసి, నిజమైన పేదలకు వైద్య సేవలు క్షేత్రస్థాయిలో అందజేయడం అభినందనీయమన్నారు. యువ న్యాయవాదిగా పేదలకు ఉచిత న్యాయ సేవ అందించడమే కాక, సామాజిక సేవలో భాగంగా పేద కుటుంబాలకు వైద్య సేవలను చేరువ చేయడం ప్రశంసనీయమన్నారు. నేటి యువత తిరివీధి కృష్ణ బాటలో పయనించాలని సూచించారు. సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు తిరివీధి కృష్ణ, ప్రతినిధులు పాల్గొన్నా·
రు.











