
పచ్చదనం పరిశుభ్రత కోడూరు లో తడి చెత్త పొడి చెత్త. అవగాహన కార్యక్రమం.
కోడూరు అమరావతి అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలం కోడూరు పంచాయతీ కార్యాలయము నందు పచ్చదనం పరిశుభ్రత తడి చెత్త పొడి చెత్త అవగాహన సదస్సు కోడూరు సెంటర్ నందున్న వ్యాపారస్తులందరికి నిర్వహించటమైనది .ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్ కవర్లు గ్లాసులు ప్లాస్టిక్ సంబంధించి ఏ వస్తువులు అయినా నిషేధించాలని షాప్ యజమానులకు తగు సూచనలు తెలియజేశారు తడిచెత్త పొడి చెత్త అవగాహన కార్యక్రమం కోడూరు పంచాయతీ సర్పంచ్ వెన్న షైనీ మరియుకోడూరు పంచాయతీ కార్యదర్శి బి.శేషగిరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రధాన సెంటర్ లో ఉన్న షాప్ యజమానులు అందరికీ చిన్న చిరు వ్యాపారులకు పిలిపించి పంచాయతీ వాహనం మీ వీధుల్లో కి వచ్చి తడి చేత్తపొడి చెత్త వాహనాల్లో వేసి సహకరించాలని గ్రామస్తులు పంచాయతీ సిబ్బందికి సహకరించాలని ఇలా చేయటం వల్ల అంటురోగలు రాకుండా జాగ్రత్త పడవచ్చు అని తెలిపారు
👉 ఈ సందర్భంగా సోలార్ కరెంటు గురించి అవగాహన కార్యక్రమాన్ని కూడా తెలియపరిచారు భవిష్యత్తులో కరెంటు బిల్లులు అధికంగా రావడం వలన చిన్నచితక వ్యాపారస్తులు బహు ఇబ్బంది పడుతున్నారు అని తెలిసి సోలార్ కరెంటు ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని తగు సూచనలు తెలియపరిచారు అవసరమైతే బ్యాంకుల ద్వారా సబ్సిడీపై లోన్లు ఇప్పిస్తామని తెలియజేశారు