
ఏలూరు జిల్లా
ముదినేపల్లి
అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవిని సన్మానించిన ఏలూరు జిల్లా బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణ* కుల మత వర్ణ వర్గ లింగ బేధాలు లేకుండా ప్రజా సేవ చేస్తూ వైద్య విద్యలభ్యసిస్తున్న ముదినేపల్లి మణిహారం అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా రెండవసారి సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదగాఐడెంటి కార్డు నియామక పత్రాన్ని తీసుకున్న అంబుల వైష్ణవి ని దుశ్యాలువాతో సన్మానం చేశారు అనంతరం పువ్వు పుట్టగానే పరిమళించను కదా అన్న విధంగా తన బాల్యదశ నుంచి కూడా తోటి విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తూ విద్యార్థులుకి పాఠశాలలో వారికి అవసరమగు సామాగ్రి అందిస్తూ,పేద ప్రజలకు తమ వంతు ధన రూపేనా, ఆహార ధాన్యరూపేనా, సహాయ సహకారాలు అందిస్తూ సమైక్య ఆంధ్ర ఉద్యమంలో 40 రోజులు దీక్షలో పాల్గొని అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చేత ప్రశంశలు అందుకుని,అమరావతి రాజధాని నిర్మాణం కోసం తన తండ్రికి ఉన్న మూడు ఎకరాల మాగాణి భూమి లోని ఒక ఎకరం ఎభయ్ సెంట్లు భూమిని అమ్మి 45లక్షల రూపాయలు అమరావతి అభివృద్ధి విరాళం గా ఇచ్చి సచివాలయం,హైకోర్టు నిర్మాణం రోడ్డు మరమ్మతులు పోలవరం ప్రాజెక్టు పనులకు గాను తన చేతి గాజులు మెడలో బంగారపు గొలుసు అమ్మి 5లక్షలు రూపాయలు విరాళం అందించినందుకు,ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి గ్రామాన్ని సందర్శించి విరాళాలు సేకరిస్తానన్న చిరంజీవి అంబుల వైష్ణవిని, డాక్టర్ మనోజులకు తన వంతు సహకారం అందిస్తానని ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా చిన్నారి అంబుల వైష్ణవికి మద్దతుగా ప్రతి ఒక్కరూ సహకరించి విరాళాలు ఇవ్వాలని,ప్రపంచ దేశాల్లోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఉన్నతంగా చూడాలన్న వైష్ణవి ఆశయ సాధన కోసం మనందరం వెన్నటి నిలబడి మన ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చి మన ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచు అంబుల వైష్ణవిని ఆశీర్వాదించాలని,ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భాగస్వాములు కావాలనీ కోరారు