ताज़ा ख़बरें

బాధ్యతగా సామాజిక సేవా

బాధ్యతగా సామాజిక సేవ


* పెద్దలలో తల్లిదండ్రులను వీక్షించడం ప్రశంసనీయం
* మానవ సేవ మాధవ సేవ గా గుర్తింపు
* తిరివీధి లక్ష్మీ రామారావు సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు, యువ న్యాయవాది తిరివీధి కృష్ణ కు ప్రశంసలు
* 15వ అదనపు జిల్లా జడ్జ్ ఏ నాగ శైలజ


నూజివీడు మండలం తుక్కులూరు గ్రామ పరిధిలోగల జేబిఎల్ వృద్ధాశ్రమంలో అవసరమైన వారికి 15వ అదనపు జిల్లా జడ్జ్ ఏ నాగ శైలజ ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్జి నాగ శైలజ మాట్లాడుతూ మానవసేవే మాధవ సేవగా గుర్తించి తిరివీధి లక్ష్మీ రామారావు సేవా ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్, యువ న్యాయవాది తిరివీధి కృష్ణ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. పేదలు, వృద్ధులు, అనాధలు ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకొని మెడికల్ క్యాంపులు నిర్వహించి ఉచిత పరీక్షలు, ఉచితంగా మందులు అందించడం ప్రశంసనీయమన్నారు. వివిధ ప్రాంతాలలో సేవా ట్రస్ట్ పేరిట సబ్సిడీపై కళ్ళజోళ్ళు, శస్త్ర చికిత్సలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జేబీఎల్ వృద్ధాశ్రమంలో సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా కళ్ళజోళ్ళు అందించినట్లు వివరించారు. నేటి సమాజంలో తల్లిదండ్రులు జీవించి ఉండగానే వారి బిడ్డలు ఆస్తులను కైవసం చేసుకుని బయటకు గెంటి వేస్తున్నారని వాపోయారు. అలాంటి సమాజంలో యువ న్యాయవాది తిరివీధి కృష్ణ తన తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి వారి పేరిట సేవా ట్రస్ట్ ఏర్పాటు చేయడంతో పాటు, ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎందరో పేదలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు కూడా అందించడం పూర్వజన్మ సుకృతం అన్నారు. ఇదే వృద్ధాశ్రమంలో ఎందరో పెద్దల జీవితాలలో వారి వారి పిల్లలతో పడుతున్న అగచట్లను వింటుంటే హృదయం ద్రవిస్తోందన్నారు. అలాంటి వారికి తాము న్యాయ సేవ పరంగా అండగా ఉన్నప్పటికీ, వైద్య సేవలలో తిరివీధి కృష్ణ చేస్తున్న సేవలు నేటి యువతకు ఆదర్శనీయమన్నారు. అన్ని వర్గాల ప్రజలు కృష్ణ చేస్తున్న సేవల మార్గంలో పయనించాలని సూచించారు.

Show More
Back to top button
error: Content is protected !!