ఈనెల 24న నూజివీడులో ఉచిత నేత్ర వైద్య శిబిరం
ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న నూజివీడు నియోజకవర్గం లోని
నూజివీడు పట్టణం నందు
ముస్లిం బజార్ సచివాలయం వద్ద తిరివీధి లక్ష్మీ రామారావు సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలనుండి ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు తిరివీధి కృష్ణ తెలిపారు. నూజివీడులో ఆయన శుక్రవారం మాట్లాడుతూ ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరంలో పరీక్షలు ఉచితంగా నిర్వహించి, మందులు పంపిణీ చేస్తామన్నారు. సేవా ట్రస్ట్ తరఫున పేదలకు ఉచిత కళ్ళజోళ్ళు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. సబ్సిడీపై అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నట్లు వివరించారు. నూజివీడు పట్టణ పరిసర ప్రాంతాలలోని ప్రజలు ఈ నేత్ర వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.










