
ఏలూరు జిల్లా ముదినేపల్లి ::::: *సీ.ఏం చేతులమీదుగా అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా ఐ.డీ.కార్డు,అందుకొన్న అంబుల వైష్ణవి* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా సిఆర్డిఏ ఉత్తర్వులను జారిచేయగా అంబుల వైష్ణవి,ఆమె తండ్రి మనోజ్ లు సీ.ఏం.చంద్రబాబు నాయుడిని కలసి సీ.ఏం.కి ధన్యవాదాలు తెలియచేసారు అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా వైద్య విద్యనభ్యసిస్తున్న వైష్ణవి తాను చదువుకొంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి తనవంతుగా ధన సహాయం చేస్తూ, ముదినేపల్లి మండలంలోని పేద ప్రజలకు ఆపదలు వస్తే వారి, వారి, కుటుంబాలకి తనవంతు సహాయ,సహకారాలను అందిస్తూ ముందుకు నడిపిస్తూన్న డాక్టర్ మనోజ్,వైష్ణవి లను సీ.ఏం. అభినందించారు అమరావతి అభివృద్ధి కోసం, విద్యార్థిని,విద్యార్థులుని, యువతను,రైతులని,అన్ని రంగాలలోఉన్న కార్మికులను, రాష్ట్రప్రజలను, ఉద్యోగస్తులను,ఎన్.జి.ఓ లను, అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ సంస్థలను, కలుపుకొంటూ అమరావతి అభివ్రుద్దికి కృషి చేయాలని దిశానిర్దేశించారు అంబుల వైష్ణవి వైద్య విద్య నభ్యసించాలని, తన తండ్రి మనోజ్ సహాయ సహకారాలు, బంధు,మిత్రులు,యువత సహాయ సహకారాలు తీసుకొని ముందుకు సాగాలన్నారు అంబుల వైష్ణవి అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా అమరావతి అభివృద్ధికి కృషి చేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తపరిచారు డాక్టర్ మనోజ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వైష్ణవికి తమవంతుగా సహాయ సహకారాలు అందించాలని కోరారు అమరావతి బ్రాండ్ అంబాసిడర్ వైష్ణవి మాట్లాడుతూ కొత్త సంవత్సరం తెలుగువారి ఉగాది పండుగ అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం రాజ్య శ్యామల హోమాన్ని నిర్వహిస్తానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం అందరి సహాయ సహకారాలు అందిస్తారని ఆశాభావాని వ్యక్తపరుస్తూ తదుపరి కార్యాచరణను వివరిస్తానని తెలియచేసారు