ताज़ा ख़बरें

ఆగిరిపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

ఆగిరిపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

ఆగిరిపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ఆగిరిపల్లి మండలం లోని ఆగిరిపల్లి సెంటర్లో లో గ్రామంలో నందు ఉచిత వైద్య శిబిరం తిరివీధి లక్ష్మీ రామారావు సేవా ట్రస్ట్, ఆధ్వర్యంలో బుధవారం విజయవంతంగా నిర్వహించినట్లు ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ తిరివీధి కృష్ణ తెలిపారు. ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి
గ్రామంలో ఆయన బుధవారం మాట్లాడుతూ తిరి వీధి లక్ష్మి రామారావు సేవా ట్రస్ట్ సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించినట్లు చెప్పారు. వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేసినట్లుగా వివరించారు. ఈ క్యాంపులను ఆగిరిపల్లి మండల పరిధిలోని ఆగిరిపల్లి గ్రామంలోని ప్రజలు వినియోగించుకున్నట్లు తెలిపారు. మరికొన్ని క్యాంపులు నూజివీడు నియోజకవర్గ పరిసరాలలో నిర్వహిస్తామని, పేదలు నివసించే ప్రాంతాలలో వైద్యసేవలను ఉచితంగా అందించేందుకు తమ ట్రస్ట్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని వివరించారు. ఇతర వివరాల కోసం 96403 24266 సెల్ నంబర్ లో వైద్య సేవలు అవసరమైన పేదలు సంప్రదించవచ్చు అన్నారు. మెడికల్ క్యాంపు నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి తిరివీధి కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.

Show More
Back to top button
error: Content is protected !!