

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈనెల జరుగు 26వ తేదీ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఏలూరు జిల్లా వ్యాప్తంగా భక్తులు సౌకర్యార్థం ఏలూరు జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన శైవ పుణ్యక్షేత్రాలకి ప్రత్యేక బస్సులు నడపబడుచున్నవి.
ఏలూరు డిపో నుండి బలివే క్షేత్రానికి ఈనెల 25వ తేదీ మధ్యాహ్నం నుండి 26 వ తేదీ ఉ.3గం నుండి 27వ తేదీ ఉదయం వరకు దాదాపు 40 ప్రత్యేక బస్సుల్ని నడపడం జరుగుతున్నది.
అదేవిధంగా ఆరోజు ద్వారకాతిరుమల పాదయాత్ర కి వెళ్ళు భక్తుల సౌకర్యం నిమిత్తం ద్వారకాతిరుమల నుండి ఏలూరుకి దాదాపు 25 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది.
అదేవిధంగా వీరంపాలెం లోని స్పటిక శివలింగ దర్శనానికి ఏలూరు నుండి ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
ఏలూరు జిల్లాలో విశేషమైన పట్టిసీమకు జంగారెడ్డిగూడెం నుండి 36 బస్సులు,తాడ్వాయికి మూడు బస్సులు 25వ తేదీ మధ్యాహ్నం నుండి 27వ తేదీ ఉదయం వరకు బస్సులు నడపబడును.
నూజివీడు డిపో నుండి బలివే క్షేత్రానికి 15 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లుగా ఈ బస్సులు కూడా 25వ తేదీ మధ్యాహ్నం నుండి 27వ తేదీ ఉదయం వరకు నడపబడతాయని భక్తులందరూ కేవలం ఆర్టిసి బస్సులో ప్రయాణించి పరమేశ్వరుడు ఆశీస్సులు పొందాలని ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి ఆపదలకి గురి కావద్దని ప్రయాణికులు సంఖ్యను బట్టి ఇంకా వారిని బస్సులు పెంచుతామని ఏలూరు జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శ్రీ ఎన్.వి.ఆర్. వరప్రసాద్ తెలియజేశారు.









